స్టేషన్ మాస్టర్ టామా
Posted by Kishore on 03:08 with No comments
స్టేషన్ మాస్టర్ టామా
ఆ పిల్లి ఓ స్టేషన్ మాస్టర్!
టామాకు దైవత్వం
నిజమైన స్టేషన్ మాస్టర్ కూడా అంత చిత్తశుద్ధితో చేయలేని సేవలు టామా చేసింది. అందుకే ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు టామాను దైవంతో సమానంగా చూస్తున్నారు.
ఆ పిల్లి ఓ స్టేషన్ మాస్టర్!
జపాన్‌కు చెందిన ఒక పిల్లి కిషి రైల్వేస్టేషన్‌కి స్టేషన్‌మాస్టరు. దాని పేరు టామా. టామా సేవలు అసాధారణం. కిషి రైల్వేస్టేషన్ ఆదాయాన్ని పెంచి ఎంతో మందికి ఉపాధి కల్పించింది. రైల్వేశాఖకు గణనీయంగా రాబడి పెంచింది. ఇటీవలే టామా గుండె ఆగి మరణించింది. టామా అంతిమ యాత్రలో దాదాపు మూడువేల మంది పాల్గొన్నారు.
నిజమైన స్టేషన్ మాస్టర్ కూడా అంత చిత్తశుద్ధితో చేయలేని సేవలు టామా చేసింది. అందుకే ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు టామాను దైవంతో సమానంగా చూస్తున్నారు.
టామా వల్లనే తమ జీవితాలు బాగుపడ్డాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. జపాన్ దేవుడైన షింటో గాడెస్‌గా టామాకు దైవత్వం ఆపాదించారు.
మొదటి స్టేషన్ మాస్టార్
ప్రపంచంలో ఒక పిల్లి స్టేషన్‌మాస్టర్‌గా వ్యవహరించడం జపాన్‌లోనే జరిగింది. జపాన్‌లోని కిిషి రైల్వేస్టేషన్‌లో 2007 జనవరిలో స్టేషన్‌మాస్టర్‌గా ఎంపికైంది టామా. జపాన్‌లోని వాకాయామా జిల్లాలో కినోకావా అనే ఊళ్ళో పుట్టింది టామా. అక్కడ దగ్గరలో ఉన్న కిషి రైల్వే స్టేషన్‌లోని కొంతమంది వ్యక్తులు దీన్ని పెంచారు. 2004లో కొన్ని ఆర్థిక కారణాలు, పరి స్థితుల వల్ల ఈ స్టేషన్ మొత్తం మూతపడే పరిస్థితి కలిగింది. దీనివల్ల ఎందరో ఉపాధి కోల్పోవాల్సింది. అలాంటి పరిస్థితుల్లో టామా వారిని ఆదుకుంది. వారి జీవితాలను నిలబెట్టింది. కిషిలో అనధికార రైల్వేస్టేషన్ మాస్టార్ తోషికో కొయామా. టామా ప్రతిభ గుర్తించి దాన్ని దత్తత తీసుకున్నాడు. ప్రయాణికులు ఒత్తిడి చేయడంతో, ఆ స్టేషన్‌ను మూసేయాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కన బెట్టింది ప్రభుత్వం. 2006, ఏప్రిల్‌లో తిరిగి స్టేషన్ ప్రారంభమైంది. అప్పటి దాకా ఉన్న కొందరు సరిగా పనిచేయని ఉద్యోగులను తొలగించి, ఆ స్థానాల్లో వేరే ఉద్యో గులను నియమింపజేశాడు కోయిమా. ఆదాయాన్ని పెంచడంలో పిల్లి కూడా సహకరిస్తోందనే విష యాన్ని గుర్తించిన కోయిమా, టామాను స్టేషన్ మాస్టర్‌గా నియమించాడు. రైల్వే ఆఫీసర్లు కూడా అందుకు అనుమతినిచ్చారు.
టామా విధి నిర్వహణ
ఆదాయం పెరిగింది టామా వల్లే!
టామా పేరుతో ప్రత్యేక రైలు
టామా చేసిన సేవలకు గుర్తింపుగా వాకాయామా ఎలక్ర్టిక్ రైల్వేస్టేషన్ 2009 నుంచి ప్రత్యేక రైలు నడుపుతోంది. ‘టామా దెన్షా’ అనే రైలులో టామా కార్టూన్‌లు ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఆ రైల్వేస్టేషన్ బిల్డింగ్‌ను కూడా టామా ముఖం ఆకృతిలోనే నిర్మించారు. ఫ్రెంచ్, జర్మనీ భాషల్లో టామా పేరు మీద ఒక డాక్యుమెంటరీని కూడా నిర్మించారు. ఇప్పుడు టామా లేని లోటు తీర్చడానికి ‘నిటామా’ అనే మరో పిల్లిని స్టేషన్ మాస్టారిగా నియమించనున్నారు.
స్టేషన్‌మాస్టరుగా నియమించిన తర్వాత టామా ప్రారంభించిన మొదటి పని వచ్చేపోయే ప్రయాణికులను పలకరించడం. అందుకోసం స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బల్ల వేసి, టామాను దానిపై కూర్చోబెట్టారు. వచ్చిపోయే ప్రయాణికులను ప్రేమతో పలకరించేది టామా. కేవలం పదవి మాత్రమే కాదు ఒక మనిషికిచ్చినట్టే టామాకు గౌరవం, ఉద్యోగానికి తగిన వేతనం, డ్రెస్‌కోడ్ అన్నీ సమకూర్చారు. రైల్వే యంత్రాంగం దానికి ఆహారం సమకూర్చేది.
స్టేషన్ మాస్టరుగా నియమించడంతో చాలా మంది ప్రయాణికులను టామా ఆకట్టుకుంది. ఒక్కొక్కసారి టామాను చూడ్డానికే ప్రయాణికులు వచ్చేవారు. అలా పద్నాలుగు నెలల్లో (2006-07) ప్రయాణీకులు 17 నుంచి 27 శాతానికి పెరిగారు. టామా వల్లే 2008లో ఆదాయం 100 కోట్లకు పెరిగిందని అధికారులు తేల్చారు. దాంతో 2010లో టామాకు ప్రత్యేకంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేశారు. ‘ఆపరేటింగ్ ఆఫీసర్’గా పదోన్నతి కూడా ఇచ్చారు. ఇలా రెండు రకాల బాధ్యతలను నిర్వహించేది టామా. దీనికి తోడుగా టామా చెల్లిని, తల్లిని అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లుగా నియమించారు.
టామా చేసిన సేవలకు గుర్తింపుగా వాకాయామా ఎలక్ర్టిక్ రైల్వేస్టేషన్ 2009 నుంచి ప్రత్యేక రైలు నడుపుతోంది. ‘టామా దెన్షా’ అనే రైలులో టామా కార్టూన్‌లు ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఆ రైల్వేస్టేషన్ బిల్డింగ్‌ను కూడా టామా ముఖం ఆకృతిలోనే నిర్మించారు. ఫ్రెంచ్, జర్మనీ భాషల్లో టామా పేరు మీద ఒక డాక్యుమెంటరీని కూడా నిర్మించారు. ఇప్పుడు టామా లేని లోటు తీర్చడానికి ‘నిటామా’ అనే మరో పిల్లిని స్టేషన్ మాస్టారిగా నియమించనున్నారు.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!