Photoshop Basics - Tools Introduction

Posted by Unknown on 10:08 with No comments

Photoshop Tools and Using Methods



1. Rectangle Marque Tool (M)

2. Move Tool (V) 

ఫోటోషాప్ ని తెరవగానే మనకి ఆక్టివ్ గా ఉండే టూల్ మూవ్ టూల్. ఈ టూల్ వలన మన సబ్జెక్టుని డాక్యుమెంట్ లో కావలసిన స్థలం లోకి మనం కోరుకున్నట్ట్లుగా మార్చవచ్చు.

3. Lasso Tool (L)

4. Magic Wand Tool (W)

మ్యాజిక్ వ్యాండ్ టూల్ ద్వారా నిర్దిష్టమైన రంగులను ఒకే ఒక క్లిక్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని గురించి పరిపూర్ణమైన అడ్వాన్స్డ్ సమచారం ముఖ్యమైన వివరాలు త్వరలో పొందుపరుస్తాము.

5. Air Brush Tool (J)

టూల్ తో మనం తొలగించాలనుకున్న సబ్జెక్ట్ మీద 3 సార్లు గ్రాడ్యూల్ క్లిక్ చేస్తే డిక్రీస్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక ఎరుపు రంగు లో ఉన్న బాక్సు ని తొలగించాలంటే టూల్ ని దాని మీద క్లిక్ చేస్తే మోదటి సారి  మొత్తం ఎరుపు రంగులో ఉన్న సబ్జెక్టు సగం ఎరుపు రంగులోకి మారి తరువాత ఇంకా కొంచెం లైట్ కలర్ గా మారి మూడవసారి క్లిక్ చేస్తే పూర్థిగా తొలగిపోతుంది.   

6. Paint Brush Tool (B)

7. Stamp Tool (S)

8. History Brush Tool (Y)

9. Erase Tool (E)

టూల్ తో మనం చేసిన ఎఫెక్ట్స్ ని కాని ఫిగర్స్ ని కాని ఎరేస్ చేయవచ్చు. ఎరేసర్ టూల్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత మౌస్ లో కుడివైపు క్లిక్ చేయడం ద్వారా బ్రష్ సైజు మార్చుకోవచ్చు అలాగే మనకు కావలసిన నమూనాని ఎంపిక చేసుకోవచ్చు.  

10. Blur Tool (R)

బ్లర్ అంటే మనకి కావలసిన సబ్జెక్టు స్పష్టంగా కనిపించకపోవడాన్ని బ్లర్ అని ఫోటోషాప్ వాడుక భాషలో అంటాము. ఎఫెక్టు సాధరణంగా డిజైనర్లు విరివిగా వారి ఉపయోగాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటారు. టూల్ ని సెలెక్ట్ చేసుకుని అప్లై చేయడం ద్వారా స్పష్తంగా ఉన్న ఫోటొ ని బ్లర్ చేయవచ్చు. దీని పరిమాణాన్ని ఎంత కావాలో మనం నిర్దేషించుకోవచ్చు.

12. Dodge Tool (O)

13. Pen Tool (P)


పెన్ టూల్ మనం అన్నింటికన్నా ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సిన అంశం. సరదాగా ఫోటొషాప్ నేర్చుకోవడం వేరు అయితే పెన్ టూల్ లో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా దానిని మనం వ్యక్తిగతంగా అందులో వ్రుత్తి ని ఎంపిక చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫర్లకి దీనిపై పట్టు ఉండడం చాలా మంచిది.
ఇక ఈ టూల్ విషయానికొస్తే పెన్ టూల్ ద్వారా వ్రుత్తాకారం లొ గల చివరలను చాలా సులభంగా మన నేర్పు ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. 

14.Type Tool (T)

టైప్ టూల్ అంటే మనందరికీ తెలిసిందే. ఇది దాదాపు అన్ని సాఫ్ట్ వేర్ లలో నిక్షిప్తమై ఉంటుంది. దీని ద్వారా మనకి కావలసిన పేర్లను పొందుపరచవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ గా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవి రాబోయే ఛాప్టర్లలో వివరంగా చెప్పబడుతుంది.

15. Measure / Shape Tool (U)

కళ అంటే ఇష్టపడనివాళ్ళు అసలు ఉండరెమో! ఫోటోషాప్ లో అందమైన `టూల్ "షేప్ టూల్". షేప్ టూల్ ద్వార మనం లోగోలను అందంగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్నెట్ సదుపాయం ఉంటే లక్షల్లో మనకి కావలసిన షేపులు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్! మీరుకూడా దీనిని ఒకసారి వాడి చూడండి మరి.  

16. Linear Gradient Tool (G)

గ్రేడియంట్ అంటే ఒక రంగు నుంది ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ రంగులలోకి మార్చినపుడు వచ్చే రంగుల సముదాయమే గ్రేడియంట్. దీనిని మనకి కావలసిన లేయర్ మీద కాని, షేప్ మీద కాని, కొన్ని ప్రత్యేకమైన ఎఫెక్ట్స్ కోసం గాని విరివిగా వాడుతూ ఉంటాము.  

17. Paint Bucket Tool (K)

పెయింట్ బకెట్ టూల్ ద్వారా మనకి నచ్చిన లేయర్ మీద కావలసిన రంగు ని అప్లై చేసుకోవచ్చు. ఈ టూల్ తో ఒక నిర్దిష్టమైన రంగుని మనం కోరుకునే రంగులోకి మార్చుకోవచ్చు.   

18. Eye Dropper Tool (I)

19. Hand Tool (H)

20. Zoom Tool (Z)

21. Color Swatch ICON Tool (X)

22. Default Standard Color Mode (D)

23. Unmask / Mask Mode (Q)

24. Toggle Full Screen (F)

25. Line Tool (Shift+N)

టూల్ మీద డబుల్ క్లిక్ చేసుకుంటే ఆప్షన్ ప్యానెల్ లో వెయిట్ ఉన్న చోట నంబరింగ్ ఎంచుకుంటే అంతే మందం కలిగిన గీత గీయబడుతుంది. దీనిని షిఫ్ట్ కీ తో డ్రా చేయడం ద్వారా గీత సమానంగా గీయబడుతుంది