Piriform - C Cleaner
Posted by Unknown on 06:51 with No comments
C Cleaner
(Freeware)
C Cleaner ఒక అద్భుతమైన క్లీనింగ్ సాఫ్ట్ వేర్. ఈసాఫ్ట్ వేర్ మీయొక్క ప్రైవసీని కాపాడుతూ మీ కంప్యుటర్ ని వేగంగా పనిచేయడంలో సహాయపడుతుంది
Award-winning PC Optimization
మిలియన్ల కొద్దీ యూజర్లు ఈ సాఫ్ట్ వేర్ ని వాడుతూ సంతృప్తిని పొన్దుతున్నారు. ఎందుకు ఈ సాఫ్ట్ వేర్ అంట పేరును సంపాదించుకుంది అంటే దీనిని వాడటం చాలా సులబం . ఒకే ఒక క్లిక్ ద్వారా కంప్యూటర్ ని అనాలసిస్ చేసి దానిలో దాగి ఉన్న తాత్కాలికమైన చెత్త ని తొలగిస్తుంది .
Makes your Computer Faster
మీ కంప్యూటర్ నిదానంగా పని చేస్తుందా? అయితే వెంటనే ఈ సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకొని వేగంగా పని చేసే సామర్ట్యాన్ని మీ సిస్టమ్ కి అందించండి . ఎలాగైతే మనం వాడుకని బట్టి మన సిస్టమ్ పాతగా అవుతుందో అలాగే అందులో అనవసరమైన చెత్త పేరుకుపోయి నిదానంగా పని చేయడం ప్రారంభం అవుతుంది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఆ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు.
Safer Browsing
అడ్వర్టైజింగ్ చేయువారు మరియు వెబ్సైట్ వారు మనం సిస్టమ్ ని ఉపయోగించే విధానాన్ని బట్టి కుకీస్ ద్వారా ట్రాక్ చేస్తారు. క్లీనర్ బ్రౌజర్ చరిత్ర అంశాలను, కుకీలను, ఇంకా మన వ్యక్తిగత సమాచారాన్ని మనం కావాలనుకున్నప్పుడు పూర్థిగా తొలగిస్తుంది. దీని వలన మన వ్యక్తిగత సమాచారము ఎవరికీ తెలియదు
ఎక్కువ సమయం సిస్టమ్ పై కేటాయించడం ద్వారా చిన్న చిన్న లొసుగులు మరియు రిజిస్ట్రీ పొరపాట్లు జరిగి సిస్టమ్ ని హాంగ్ అవడానికి తరచూ గురి చేస్తూ ఉంటాయి. ఇందులో ఇమిడి ఉన్న రిజిస్ట్రీ క్లీనర్ ఆ పొరపాట్లను సరిదిద్ది వేగవంతంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.
Quicker Startup
చాలా ప్రోగ్రాములను మనం గమనిస్తే అవి పనిచేయడానికి మన సిస్టమ్ వేగాన్ని తగ్గిస్తాయి. ఈ సాఫ్ట్ వేర్ మన పనిని వేగవంతం చేయడానికి బ్యాగ్రౌండ్ లో పని చేస్తున్న అప్లికేషన్లను తాత్కాలికంగా ఆపడంలో సహాయపడుతుంది.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!