ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి బాటలో నడవాల్సిందే- వర్మ

Posted by Kishore on 04:35 with No comments
రాజమౌళి పై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ..... 

ప్రేక్షకులను ఎంతగానో ఊరించిన ‘బాహుబలి’ చిత్రం విడుదలై మంచి టాక్ సంపాదించి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ‘బాహుబలి’పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందించిన వర్మ...ఇక నుంచి ఏ స్టార్ హీరో సినిమా అయినా బడ్జెట్ విషయంలో బాహుబలి తర్వాతే అన్నారు. మొదటిసారిగా హీరోల కన్నా సినిమాయే పెద్దదిగా కనపడడం బాహుబలితో సాధ్యమైందని..అయితే ‘శ్రీమంతుడు’లో మహేశ్, ‘కిక్2’లో రవితేజయే స్టార్లుగా కనబడతారని వర్మ చెప్పారు. ఈ సినిమా స్టార్ హీరోలందరికీ కనువిప్పులా మారాలన్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి చూపిన బాటలోనే నడవాల్సిన పరిస్థితి కల్పించారని ట్విట్ చేశారు. బాహుబలి తర్వాత విడుదలయ్యే మహేశ్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్, తారక్‌ తదితరుల సినిమాలు 5D స్థాయిలోనే ఉండాలన్నారు. సింహాలు, పులులు. కొండ చిలువలు, ఏనుగులు ఉన్న ఇండస్ట్రీ అనే అడవిలోకి బాహుబలి అనే డైనోసార్ వచ్చిందన్న వర్మ మిగతా వారు మారక తప్పని పరిస్థితిని కల్పించిందన్నారు. రాజమౌళిని చూసి దర్శకులందరూ జెలసీతో చస్తున్నారని..అయితే మౌళి ఇంకో సినిమా తీయడానికి మరో నాలుగేళ్ల సమయం తీసుకుంటే సినిమా పరిశ్రమే ఉండదని వర్మ తన ట్విట్ల సునామీలో వెల్లడించారు.