సాహా.. విశ్రాంతి తీసుకో: కుంబ్లే
Posted by Kishore on 06:29 with No comments
న్యూజిలాండ్‌తో టెస్టుసిరీస్‌లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను రెండు వారాలు విశ్రాంతి తీసుకోమని అనిల్ కుంబ్లే సూచించాడు. అంతేకాదు ఈ మేరకు బెంగాల్ రంజీ జట్టుకు కూడా కుంబ్లే ఆదేశాలు కూడా జారీ చేశాడు. దీంతో ఉత్తరప్రదేశ్,పంజాబ్‌తో బెంగాల్ తలపడే రంజీ మ్యాచ్‌లకు సాహా దూరం కానున్నట్లు బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారి చెప్పాడు. . ‘‘సాహాను విశ్రాంతి తీసుకోమని కుంబ్లే చెప్పినట్లు నాకు సమాచారం అందింది. కాబట్టి తొలి రెండు రంజీ మ్యాచ్‌లకు సాహా దూరం కానున్నాడు’’ అని తివారి చెప్పాడు.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!