ఏడాదిలోనే ఆస్తుల విలువ 820 శాతం పెరిగితే?

Posted by Kishore on 06:26 with No comments

షాంఘైకి చెందిన హురున్ పబ్లిషర్స్ ప్రకటించిన చైనాలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో ప్రాపర్టీ మాగ్నెట్ జియాన్లిన్ వాంగ్ అగ్రస్థానంలో నిలిచారు. 32.1 బిలియన్ డాలర్లతో ఆయన జాక్ మా కంటే మెరుగైన స్థానంలో నిలిచారు. అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడైన జాక్ మా సంపద 41 శాతం పెరిగినప్పటికీ ఆయన ఆస్తుల విలువ 30.6 బిలియన్ డాలర్లుగానే నమోదైంది.

ఇక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. బావోనెంగ్ గ్రూప్ చైర్మన్ అయిన యావో ఝెన్హువా సంపద 2015తో పోలిస్తే 820 శాతం పెరిగి 17.2 బిలియన్ డాలర్లకు చేరడం. సంపన్నుల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన చైనా వాంకే కో లిమిటెడ్‌ను ఆయన చేజిక్కించుకొని మార్కెట్ దృష్టిని ఆకర్షించారు. చైనాలో రూపొందుతున్న నూతన తరం సంపనులకు ఈయనో ఉదాహరణ అని హురున్ రిపోర్టర్ వ్యాఖ్యానించారు. చైనా స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో పోటి పెరుగుతున్న నేపథ్యంలో షియోమీ సహ వ్యవస్థాపకుడు లి జున్ టాప్-10 ధనవంతు జాబితాలో చోటు కోల్పోయారు. బిలియనీర్ల జాబితాలో డ్రాగన్ అమెరికాను అధిగమించింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 535 మందికి చోటు దక్కగా, హురాన్ జాబితాలో 594 మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ టాప్-20 ప్రపంచ ధనవంతుల జాబితాలో చైనా నుంచి చోటు దక్కలేదు.