నిజమో కాదో గూగుల్ చెప్పేస్తుంది
Posted by Kishore on 23:26 with No comments
ఏదైనా వార్త తెలి స్తే అది నిజమా కాదా అనే సందేహంలో కొంత మంది టెక్ ప్రియులు వెంటనే దాన్ని గూగుల్ చేసి సమాచారం తెలు సుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అది నిజమా కాదా అని ఎవరు నిర్ధారిస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. దీంతో ఎక్కడాలేని కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఒక అడుగు ముందుకేసింది. సెర్చ్ కంటెంట్‌లో ఫ్యాక్ట్ చెక్ అనే ఫీచర్‌ని పరిచయం చేస్తుంది. ప్రతీ అంశం పక్కన ఫ్యాక్ట్‌చెక్ అని చూపుతుంది. ప్రస్తుతం గూగుల్ న్యూస్ అండ్ వెదర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ లో ఫ్యాక్ట్‌చెక్ ట్యాగ్‌తో అమెరికా, యూకేలలో యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన దేశా ల్లోనూ విస్తరించనుంది. దీంతో స్పష్టమైన సమచారం కోసం గంటల తరబడి వెబ్‌లో వెతికే వారికి పెద్ద ఊరటే. ప్రపంచ నలుమూలల నుంచి బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో.. వివిధ రకా ల ఆర్టికల్స్ వచ్చేవాటిలో ఏది నిజమో కాదో తెలియని సంది గ్ధం ఉంటుంది కాబట్టి న్యూస్ కచ్చితత్వంపై పనిచేస్తున్న ట్లు గూగుల్ తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య, రాజకీయ సమా చారం విషయాల్లో ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు పేర్కొంది.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!