ఆ మ్యాచ్‌లో సచిన్ 175 రన్స్ చేసినా..
Posted by Kishore on 04:22 with No comments
ఆస్ట్రేలియాతో 2009లో జరిగిన ఏడు వన్డేల సిరీస్ అది. ఐదో వన్డే మన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే జరిగింది. ఆ మ్యాచ్‌లో సచిన్ 175 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియానే నెగ్గింది. ఛేజింగ్‌లో సచిన్ ఇంత భారీ స్కోరు చేసినా మన జట్టు ఓడిపోయింది. దీంతో సచిన్ ఖాతాలో ఏ బ్యాట్స్‌మెన్క కోరుకోని రికార్డు చేరింది. ఛేజింగ్‌లో ఓ బ్యాట్స్‌మెన్ 175 పరుగులు చేసినా మ్యాచ్ నెగ్గకపోవడం రికార్డే మరి.
వాస్తవానికి ఆ మ్యాచ్ భారతే నెగ్గాల్సింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 350 పరుగు భారీ స్కోరు సాధించింది. సచిన్ పోరాటంతో ఇండియా విజయం దిశగా సాగింది. 141 బంతుల్లోనే సచిన్ 175 రన్స్ చేశాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోగా.. సచిన్ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నాడంటూ అభిమానులు ముచ్చటపడ్డారు. కానీ జట్టు స్కోరు 332 పరుగుల వద్ద, 47 ఓవర్లో సచిన్ అనూహ్యంగా అవుటయ్యాడు. అదే ఓవర్లో జడేజా కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 49.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటై విజయానికి మూడు పరుగుల దూరంలో నిలిచింది. మన జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప మ్యాచ్‌గా నిలిచిపోయేది. కానీ బ్యాడ్ లక్.

0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!