శాంసంగ్ నష్టం రూ.లక్ష కోట్లు

Posted by Kishore on 23:02 with No comments
ఓ చిన్న తప్పిదం ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థం చేసింది. శాంసంగ్..  ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లో ఇప్పటి వరకు తిరుగులేని ఆధిపత్యం. మొబైల్స్ లో అయితే రారాజుగా వెలిగింది. గెలాక్సీ 7 నోట్ ఫోన్ పేలుతుంది అన్న వార్త.. అందుకు కంపెనీ కూడా అంగీకరించటం కారణం.. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల గెలాక్సీ 7 నోట్ ఫోన్లను రీప్లేస్ చేయటం.. వాటి నుంచి కూడా పొగలు రావటంతో విమానాల్లో నిషేధం విధించారు. దీంతో గెలాక్సీ 7నోట్ ఫోన్ల ఉత్పత్తినే నిలిపివేసింది. ఈ పరిణామాలతో శాంసంగ్ సంస్థ భారీ నష్టాన్ని కూడగట్టుకుంది. నిపుణుల అంచనా ప్రకారం ఇది లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే సంస్థ 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు సంస్థనే ప్రకటించటం విశేషం. ఇది ఇండియన్ కరెన్సీలో 65వేల కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్.. సంస్థ గుడ్ విల్, సేల్స్ లో మార్కెట్ వాటా తగ్గటం.. షేర్ వ్యాల్యూ పడిపోవటం ఇలా అన్ని రకాలుగా లెక్కలు వేస్తే శాంసంగ్ మొత్తంగా లక్ష కోట్ల రూపాయల నష్టపోయినట్లు బిజినెస్ వర్గాల సమాచారం. సంస్థ మొత్తం టర్నోవర్ లక్షా 14వేల కోట్ల రూపాయలు. శాంసంగ్ మార్కెట్ విలువ మాత్రం 15 లక్షల కోట్లు.

పుంజుకున్న యాపిల్

శాంసంగ్ దెబ్బతినటంతో.. యాపిల్ కు బాగా కలిసివచ్చింది. ఐ ఫోన్ సేల్స్ భారీగా పెరిగాయి.  యాపిల్ షేర్లు 10శాతం లాభపడ్డాయి. ఐ ఫోన్ 7, 7ప్లస్ ఫోనర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.