వధువు పాకిస్తానీ...వరుడు రాజస్థాన్...కానీ అంతలోనే...
Posted by Kishore on 04:19 with No comments
వధువు పాకిస్తానీ.. వరుడు రాజస్థానీ... ఇద్దరికీ నిశ్చితార్థం అయింది. మరొకొద్ది రోజుల్లో వివాహం.. కానీ అంతలోనే అనుకోని కష్టం వచ్చింది. ఏం చేయాలో రెండు కుటుంబాలకు అర్థం కాని పరిస్థితుల్లో ఓ నేత చేసిన సాయంతో వారి అడ్డంకులు తొలగిపోయాయి. భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశం ఉందన్నభయం రెండు దేశాల్లో నెలకొంది. ఇలాంటి సయయంలో పొరుగు దేశానికి వెళ్లడం అంతసులువైన విషయం కాదు. రెండు దేశాల ఉద్రిక్తతలు మధ్య రెండు కుటుంబాల్లో టెన్షన్ నెలకొంది.
మూడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన నరేష్ తివారీకి, కరాచీకి చెందిన ప్రియ బచానీతో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 7న వీరి వివాహం జోధ్‌పూర్‌లో జరగనుంది. దీంతో ప్రియ కుటుంబం వీసా కోసం 3 నెలల నుంచి ప్రయత్నించింది. తన కుమార్తె వివాహం కోసం వీసా మంజూరు చేయాలని కోరింది. అయితే ఇస్లామాబాద్‌లోని భారత్ ఎంబసీ వీరి విన్నపాన్ని తోసిపుచ్చింది. దీంతో రెండు కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. తమ సమస్యను పరిష్కరించమని ప్రియ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సుష్మా...ప్రియ కుటుంబ సభ్యులకు వీసా మంజూరు చేయాలని ఇస్లామబాద్‌లోని భారత ఎంబసీని ఆదేశించారు. అంతే రెండు రోజుల్లో ప్రియతోపాటు మరో 11 మందికి వీసా వచ్చేసింది. ఇప్పుడు పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవని రెండు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సుష్మాకు ఆ రెండు కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!