జూలియట్‌ ఇల్లును చూద్దామా!

Posted by Kishore on 06:09 with No comments

రోమియో జూలియెట్‌లు కల్పిత పాత్రలే కావొచ్చు. కానీ వారిద్దరు ప్రేమికులకు ఆరాధ్య దైవాలు. షేక్‌స్పియర్‌ ఆలోచనలోంచి జాలువారిన ప్రేమ ప్రతిరూపాలు. అలాంటి రోమియో జూలియెట్‌ల గురించి తెలియని వారుండరు. అయితే వాళ్లు నిజంగా లేరు. కేవలం నవలల్లో కనిపిస్తారు. కానీ.. జూలియట్‌ ఉండే ఇల్లు మాత్రం నిజంగానే ఉంది. ఆమె లేనప్పుడు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందంటారా? అయితే చదవండి.
రోమియో జూలియెట్‌ నవల చదివిన వారికి జూలియెట్‌ బాల్కనీలో నిల్చున్నప్పుడు రోమియో తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశం గుర్తుండే ఉంటుంది కదా! ఆ బాల్కనీ ఉన్న భవనం నిజంగానే ఇటలీలో ఉంది. బెరొనాలోని ఓ పురాతన భవనం యజమాని ఇంటి పేరు జూలియట్‌ కావడంతో.. స్థానిక నగర పాలక సంస్థ దాన్ని జూలియట్‌ ఇల్లుగా మార్చేసింది. ఇటలీలోని బెరొనా ప్రాంతానికి చెందిన డెల్‌ కాపెల్లో కుటుంబానికి కాసా డి గిలియెట్టా పేరుతో ఓ భవనం ఉండేది. దాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడంతో పాతపడిపోయింది. 1900 సంవత్సరంలో స్థానిక పురపాలక సంస్థ ఈ భవనాన్ని కొనుగోలు చేసింది.
ఈ భవనం యజమాని పేరు రోమియో జూలియెట్‌. నాటకంలోని జూలియట్‌ కుటుంబానికి ఉన్న పేరు కాపులెట్స్‌కి పోలి ఉండటం.. నవలలో జూలియట్‌ నిల్చున్న బాల్కనీలాంటిదే ఈ భవనంలో ఉండటంతో ఈ భవనాన్ని జూలియట్‌ ఇల్లుగా మార్చాలనుకున్నారు. దీంతో ఆ ఇంటికి కొన్ని మార్పులు చేసి.. అచ్చం జూలియెట్‌ ఇల్లుగా మార్చేశారు. బాల్కనీ కింద జూలియెట్‌ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. షేక్‌స్పియర్‌ వూహల్లో వాళ్లు ధరించిన దుస్తులను ప్రదర్శనకు పెట్టారు. దీంతో ఈ భవనాన్ని చూసేందుకు ప్రేమికులు.. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.