అవుతారా.. మీరూ అంబానీ!
Posted by Kishore on 07:46 with No comments
అనంత్ అంబానీ... 18 నెలల్లో 108 కిలోలు తగ్గిన కుర్రాడు. యువతకు తాజా రోల్‌మోడల్. అంతులేని సంపద... అందుబాటులో అన్ని సౌకర్యాలు... ఇవేవీ అతడ్ని నాజూగ్గా తయారు చేయలేకపోయాయి. కేవలం కఠోరమైన శ్రమే లక్ష్యాన్ని చేర్చింది. అతగాడి అనుభవం నుంచి పాఠాలు నేర్చితే మనమూ ఏదైనా సాధించొచ్చు.
ప్రయోజనం
ప్రతి పనికీ ఒక పర్పస్ ఉంటుంది బాస్. బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉండొద్దా? నాకూ ఒక లవర్ ఉండాలి... వచ్చే పుట్టినరోజుకల్లా స్లిమ్‌గా తయారవ్వాలి... ఇలా ఏదో ఒక లక్ష్యం నిర్దేశించుకోండి. నిత్యం అదే స్మరించండి. అనంత్ సైతం 21వ బర్త్‌డేకి బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకొని కసరత్తులు ప్రారంభించాడు.
దేనికైనా సిద్ధం
ముఖేష్ అంబానీ కొడుకు కదా... బాగా డబ్బులున్నాయి కదాని అనంత్ ఒంట్లోని కేలరీలు వూరికే కరిగిపోలేదు. చాలా కష్టపడ్డాడు. రోజూ 21 కిమీలు నడిచాడు. రోజుకు ఐదారుగంటలు జిమ్‌లో గడిపాడు. నచ్చింది మానేసి నచ్చని ఆహారాన్నే ఇష్టంగా తిన్నాడు. నొప్పుల్ని పంటి బిగువున భరిస్తూ శిక్షకులు చెప్పింది విన్నాడు. ఇలాంటి కష్టానికి మీరూ సిద్ధమైతే బరువు కరిగించడం కష్టమేం కాదు.
తోడుండాలి
లక్ష్యం కొండలా ఉంటే అనుక్షణం ప్రోత్సహించేవారు పక్కన ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సగం భారం తప్పినట్టే. తల్లి నీతా అనుక్షణం అనంత్ వెంటే ఉండేది. అతడు ఏం తింటే అదే తినేది. కలిసి వ్యాయామాలు చేసేది. మనకూ అలా స్ఫూర్తిపంచే వారుంటే లక్ష్యం సునాయసమే.
టెక్నాలజీ వాడండి
ఫిట్‌నెస్ బ్యాండ్స్, వ్యాయామాల్ని కొలిచే యాప్స్... మార్కెట్లో బోలెడు దొరుకుతున్నాయి. వీటి సాయంతో ఏమేం తినాలో తెలుసుకోవచ్చు. ఎంత వ్యాయామం చేశామో, ఎంత చేయాల్సి ఉందో లెక్కలు వేసుకోవచ్చు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే లక్ష్యాన్ని దగ్గర చేసే ఇంకో సన్నిహితుడు దొరికినట్టే. అనంత్ కూడా ఈ టెక్నాలజీని బాగా వాడుకున్నాడు.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!