చెలరేగిపోతున్న చైనా గూడ్స్
Posted by Kishore on 00:14 with No comments
ఎన్‌ఎ్‌సజిలో భారత సభ్యత్వానికి మో కాలడ్డడం, తీవ్రవాది మసూద్ అజార్‌పై ఐరాస విధించదలచిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నందున దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు ఒకపక్క వెల్లువెత్తుతున్నా.. మరోవైపు భారతలో చైనా వస్తువుల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయని చైనా మీడియా కోడై కూస్తోంది. భారతలో అతిపెద్ద పండుగ సీజన్ అయిన దివాళీ సీజన్‌లో షాపింగ్ జోరుగా సాగుతుందని, ఈ సీజన్‌లో చైనా గూడ్స్‌ను బహిష్కరించాలని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోందని చైనాకు చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది. కొందరు భారత రాజకీయ నాయకులు కూడా ఇందుకు ఆజ్యం పోస్తున్నారని, ఇంత ఎత్తు న వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా... భారతలో చైనా గూడ్స్‌కు విపరీతమైన పాపులారిటీ ఉందని, ఇండియా ప్రభుత్వం చైనా వస్తువులపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.
బహిష్కరణ ప్రచారం ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని, అక్టోబర్‌లో భారత టాప్3 ఆన్‌లైన్ రిటైలర్లు విక్రయించిన వస్తువుల్లో చైనా ఉత్పత్తులు రికార్డు స్థాయిని నమోదు చేశాయని పేర్కొంది.
మీకే నష్టం...
ద్వైపాక్షిక వాణిజ్యం చైనా, భారత మధ్య బంధానికి మూలాల్లో ఒకటని, 2015లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 7,000 కోట్ల డాలర్లకు చేరిందని గ్లోబల్‌టైమ్స్ తెలిపింది. చైనాతో వాణిజ్యంలో పెరిగిపోతున్న లోటు పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ లోటుకు భారత చర్యలే కారణమని గ్లోబల్ టైమ్స్ విమర్శించింది. ఈ లోటు తగ్గించి సమతుల్యం సాధించడానికి ఇరు దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని, గతంలో తీసుకున్న చర్యలు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపింది.

0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!