రాజమౌళి పెద్ద పార్టీ ఇస్తున్నాడట!

Posted by Kishore on 04:26 with No comments
తెలుగు సినీ పరిశ్రమలో ఇతర సెలబ్రెటీల్లా కాకుండా రాజమౌళిది ప్రత్యేక శైలి. భారీ ఫంక్షన్లకు, పార్టీలకు రాజమౌళి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. తన కుటుంబంతో గడిపేందుకే ఎక్కువగా ఇష్టపడతాడు.
 
అయితే పార్టీలకు దూరంగా ఉండే రాజమౌళి ఈ నెల 23న ఓ భారీ పార్టీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. దానికి కారణం ఆ రోజు ‘బాహుబలి’ ప్రభాస్‌ పుట్టిన రోజు కావడం. మరోవైపు ఎప్పుడో మూడేళ్ల క్రితం ‘బాహుబలి’ షూటింగ్‌కు హాజరైన ప్రభాస్‌.. ఈ డిసెంబర్‌తో ఫ్రీ అయిపోతుండడం. ఈ రెండింటినీ పురస్కరించుకుని సన్నిహితులకు, ఇండస్ట్రీ పెద్దలకు ఓ హై-ఫై పార్టీ ఇవ్వాలని జక్కన్న అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
 
అలాగే ప్రభాస్‌ కూడా తన సన్నిహితులకు ఓ పార్టీ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడట. ఇటీవల ఆయన మైనపు బొమ్మను బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభాస్‌ కూడా ఓ బిగ్‌ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.