చరిత్రగర్భంలో కలిసి పోకుండా

Posted by Kishore on 22:22 with No comments
పుస్తకాన్ని మనం ఎలా చదువుతాం? ఒకవైపు నుంచే కదా! కొన్ని రకాల పుస్తకాలనైతే ఖర్చు తగ్గించుకోవడం కోసం ఒకవైపు ఒక భాషలో, మరో వైపు అదే అంశాన్ని మరో భాషలో అందిస్తారు. మహా అయితే టెక్నాలజీ ఉపయోగించి మంచి రంగుల్లో తీర్చిదిద్దుతారు. వాల్యూడ్‌ పేపర్‌ ఉపయోగిస్తారు. ఇంకా వెరైటీగా చెయ్యాలంటే పుస్తకం ఓపెన్‌ చెయ్యగానే ఆటోమాటిక్‌ సిస్టమ్‌ ద్వారా గుడ్‌మార్నింగ్‌ అనో, లేదా అందులో కంటెం ట్‌ను అందమైన స్వరం ద్వారానో నాలుగు మాటలు పలికించవచ్చు. కానీ ఎలాంటి టెక్నాలజీ సదు పాయాలు లేని రోజుల్లోనే తయారుచేసిన ఒక అద్భుతమైన పుస్తకం స్వీడన్‌లో ఇప్పటికీ పాఠకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
ఆరు వైపుల నుంచీ చదువుకునే ఈ అద్భుత పుస్తకాన్ని జర్మనీవారు తయారు చేశారు. ఈ పుస్తకం ఎప్పటిదో తెలుసా? 16వ శతాబ్దం నాటిది. స్వీడన్‌ నేషనల్‌ లైబ్రరీలో ఎంతో భద్రంగా దాచి ఉంచారీ పుస్తకాన్ని.
 
              వేలాది పేజీలు ఉండే ఈ పుస్తకాన్ని ఆరు వైపులనుంచీ చదువుకోవడానికి వీలుగా చెక్కుచెదర కుండా ఉన్న గట్టి అట్టతో మధ్యకు ఫోల్డ్‌ అయ్యేలా తయారు చేశారు. నాలుగువైపులా ఆరు మెటల్‌ హుక్స్‌ ఈ పుస్తకాన్ని బంధించి ఉంచుతాయి. మీరు ఏ వైపు తీసి చదువుకోవాలను కుంటే ఆ వైపు మెటల్‌హుక్స్‌ను తీసి చదువుకోవచ్చు. 1550 - 1570 మధ్య కాలంలో జర్మనీలో దీన్ని డిజైన్‌ చేసి ముద్రించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ పుస్తకానికి ఆరు మడతలు ఉంటాయి.
 
          స్వీడన్‌ నేషనల్‌ లైబ్రరీలో ఈ పుస్తకం నిత్యం హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. పుస్తక ప్రియులు దీన్ని చూడటానికి క్యూ కడుతూ ఉంటారు మరి! ఈ పుస్తకంలోని అంశాలు మతపరమైన, భక్తి భావ నలకు సంబంధించినవే. చరిత్రగర్భంలో కలిసి పోకుండా ఇలాంటి అరుదైన వండర్‌ బుక్స్‌ ఎన్నిం టినో స్వీడన్‌ నేషనల్‌ లైబ్రరీ సేకరించి కాపాడు తోందట!