భూమివైపు దూసుకొస్తున్న వెయ్యి ఉల్కలు.. ప్రపంచ వినాశనమే అంటున్న ఖగోళ శాస్త్రవేత్తలు
Posted by Kishore on 22:28 with No comments
2012లో ప్రపంచం అంతరించిపోతుందని చాలా ప్రచారం జరిగింది. అలా జరగకపోవడంతో ఇలాంటి వాటిని ప్రజలు నమ్మడం లేదు. అయితే నిజంగానే భూమికి పెను ముప్పు పొంచి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు వెయ్యి ఉల్కలు భూమి వైపు అతి వేగంగా దూసుకొస్తున్నట్లు గుర్తించారు. గంటకు 60 వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆస్ట్రాయిడ్లతో ప్రపంచ వినాశనం తప్పదని అంచనా వేస్తున్నారు.
2009ఈఎస్ అనే పేరు గల ఉల్క అతి త్వరలోనే భూమిని ఢీకొట్టవచ్చని చైనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. పది మైళ్ళ వెడల్పు ఉన్న ఈ అతి పెద్ద ఆస్ట్రాయిడ్ మూడు బిలియన్ అణు బాంబులతో సమానమైన విధ్వంసం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపైనున్న మూడో వంతు జీవరాశి నాశనమవుతుందని భావిస్తున్నారు.
అయితే భూమి వైపు దూసుకొస్తున్న ఉల్కలపై పరిశోధనకు అమెరికాకు చెందిన నాసా ఒసిరిస్ రెక్స్ మిషన్ చేపట్టింది. వాటి మార్గాన్ని మళ్లించి పెను ముప్పు నుంచి భూమిని కాపాడే మార్గాలను అణ్వేషిస్తోంది.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!