మసూద్ వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లో పెల్లుబికిన ఆగ్రహం

Posted by Kishore on 04:27 with No comments
తమను విడిచిపెడితే కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలిపేస్తామని జైష్ ఏ మహ్మద్ నేత మసూద్ అజర్ అన్నాడు. దీంతో మసూద్ వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పత్రికలు మసూద్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఏకాకి అయిన పాక్... మసూద్ వ్యాఖ్యలతో మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని అక్కడి మేధావులు పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
 
మసూద్ వ్యాఖ్యలు....భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు జీహాదీలకు అవకాశం ఇవ్వాలని మసూద్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాడు. నిర్ణయాత్మక లోపాల వల్లే కశ్మీర్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని మండిపడ్డాడు. కశ్మీర్‌లో జీహాదీలు ఉన్నప్పుడు, లేనప్పుడు భారత్‌లో వస్తున్న మార్పులను గమనించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మసూద్ కోరాడు. మరికొందరు జీహాదీలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని మసూద్ ప్రకటించాడు.