మోడీ వర్క్ : నో లీవ్స్

Posted by Kishore on 00:55 with No comments
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఇప్ప‌టి వ‌రకు ఎన్ని సెల‌వులు తీసుకున్నారో తెలుసా..? ప‌్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించిన వివరాలు తెలిస్తే షాక్ అవుతారు. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క సెల‌వు కూడా తీసుకోలేద‌ంట‌. ఒక దేశ ప్ర‌ధాని సెల‌వుపై వెళ్లాలంటే ఎలాంటి నియ‌మ‌నిబంధ‌న‌లు ఉంటాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేసిన ప్ర‌ధానులు ఎన్ని సెల‌వులు తీసుకున్నారు అనే స‌మాచారం కోసం ఓ వ్య‌క్తి ఆర్టీఐని సంప్ర‌దించాడు. ఈ దరఖాస్తుతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
… ప్ర‌ధాని మోడీ 2014 మే నెలలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్క సెల‌వు కూడా తీసుకోలేదు. నిరంతరం దేశం కోస‌మే ప‌నిచేస్తున్నాడని ప్ర‌ధాని కార్యాల‌యం వెల్ల‌డించింది.
… 24/7 ప్రధాని మోడీ పని చేస్తూనే ఉన్నారు. ఆల్వేస్ ఇన్ డ్యూటీ.
… గతంలో ప్ర‌ధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్ సింగ్, అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్‌, దేవెగౌడ‌, ఐకే గుజ్రాల్‌, పీవీ న‌ర‌సింహారావు, వీపీ సింగ్, రాజీవ్ గాంధీ సెల‌వు వివ‌రాలు తమ ద‌గ్గ‌ర  లేవ‌ని స్పష్టం చేసింది. ఆ రికార్డులు ప్ర‌స్తుత ప్ర‌ధాని కార్యాల‌యం మెయిన్‌టెయిన్ చేయ‌ద‌ని పేర్కొంది.
… మాజీ ప్ర‌ధానమంత్రుల సెల‌వు వివ‌రాల గురించి మ‌రో అప్లికేష‌న్‌ను సెక్ర‌టేరియ‌ట్‌కు పంపాడు. అయితే వారిద‌గ్గ‌ర కూడా స‌మాచారం లేక‌పోవ‌డంతో ఆ అప్లికేష‌న్‌ను హోమంత్రిత్వ శాఖ‌కు బ‌దిలీ చేశారు.