భారీ మోసానికి పాల్పడుతున్న చైనా.?

Posted by Kishore on 05:57 with No comments
కొత్తదనం సృష్టించడమే చైనా పని.. అంతేకాదు నిత్యావసర వస్తువులు మొదలుకుని ఫోన్ల వరకు చాలా వరకు చైనానే ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తుంటుంది. అయితే తాజాగా చైనా కృత్రిమ కోడిగుడ్ల అమ్మకాలు కూడా షురూ చేస్తున్నట్లు కేరళ మొత్తం కోడై కూస్తోంది. కేరళలోని వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి శైలజ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
 
మీడియాతో మాట్లాడిన మంత్రి శైలజ కృత్రిమ కోడిగుడ్ల అమ్మకాలపై విచారణకు ఆదేశించారు. అయితే తమకు ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు.. వస్తే మాత్రం తగు చర్యలు తీసుకుంటామన్నట్లుగా మంత్రి మీడియాతో తెలిపారు. వార్తల్లో వస్తున్న కథనాలకు మంత్రి స్పందించి.. విచారణ జరపాలంటూ అధికారులను ఆదేశించారు. చైనా నుంచి తమ రాష్ట్రానికి వస్తున్నట్లు క్లారిటీ లేదు.. అయితే తమిళనాడు నుంచి మాత్రమే కోడి గుడ్లు వస్తున్నాయని శైలజ అనుమానం వ్యక్తం చేశారు. శ్యాంపిల్స్ తెప్పించి త్వరలో నిజానిజాలు బయటపెడతామని మంత్రి చెప్పారు.
 
కృత్రిమ కోడిగుడ్ల తినడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కృత్రిమ గుడ్డు సాధారణ గుడ్లతో పోలీస్తే గుడ్డు కలర్ మొదలుకుని సొన వరకు అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ గుడ్లు పగిలినప్పుడు ఆ దరిదాపుల్లోకి కీటకాలు కూడా రావట. అంతేకాదు ఈ గుడ్ల ఉత్పత్తి సాధారణ గుడ్ల ఉత్పత్తితో పోలిస్తే చాలా చౌకట.