బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేస్తున్న ఒలింపిక్ విన్నర్!
Posted by Kishore on 00:50 with No comments
BMW కారు తిరిగి ఇచ్చేస్తున్న దీపాకర్మాకర్
ఒలింపిక్స్‌లో భారత్ తరపున జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు పొందిన దీపా కర్మాకర్ సచిన్ చేతుల మీదుగా బహుకరించిన బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కారును మెయింటెన్ చేయలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంత ఖరీదైన కారును అగర్తలా రోడ్లపైన తిప్పడం కష్టమైన పనని, రోడ్డుపై ఎక్కువగా గుంతలు, ఎత్తుపల్లాలు ఉంటాయని, ఇలాంటి రోడ్లపై బీఎండబ్ల్యూను నడిపితే అనవసరంగా పాడవుతుందనే ఉద్దేశంతో దీప ఈ నిర్ణయానికొచ్చింది. అంతేకాకుండా అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదట.
అందుకే ఆమె కారును తిరిగిచ్చేదామనుకుంటోందని ఆమె కోచ్ బిశ్వేస్వర్ నంది తెలిపారు.ఈ విషయాన్ని చాముండేశ్వరి నాథ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు నంది మీడియాకు వెల్లడించారు. ఆయన కూడా ఇబ్బందేమీ లేదని, కారును పంపినా.. ఆ కారు ఖరీదు చేసే డబ్బును దీపా అకౌంట్లో వేస్తానని చాముండేశ్వరినాథ్ చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంపై దీపాను సంప్రదించాలనుకున్నప్పటికీ ఆమె అందుబాటులో లేదు. సెప్టెంబర్‌లో పీవీ సింధుకు, దీపా కర్మాకర్‌కు, సాక్షి మాలిక్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ కార్లను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!