KCRకు సరికొత్త అర్థం చెప్పిన మంత్రి హరీష్

Posted by Kishore on 02:18 with No comments
తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని KCRకు సరికొత్త మీనింగ్ చెప్పారు హరీష్. K అంటే KNOWLEDGE (జ్ఞానము), C అంటే COMMITMENT(నిబద్ధత), R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని ఆయన కొనియాడారు. ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్‌కు శిరసు వంచి హరీష్ పాదాభివందనం చేశారు. సిద్ధిపేట జిల్లా కావడం ఎంతో సంతోషమని మంత్రి చెప్పారు. సిద్ధిపేట గురించి సీఎం చెబుతుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. కేసీఆర్ సిద్దిపేట మాట్లాడుతుంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే ఉంటుందని హరీష్ చెప్పుకొచ్చారు.