సెకనుకు 100 ఎంబిపిఎస్ స్పీడ్
Posted by Kishore on 23:53 with No comments
టెలికాం రంగంలో పట్టును నిలుపుకునేందుకు గాను భారతి ఎయిర్‌టెల్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వినియోగదారుల కోసం ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్ తాజాగా వి-ఫైబర్ టెక్నాలజీతో సెకనుకు 100 మెగాబిట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త బ్రాడ్‌బ్యాండ్ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు ఈ సేవలను అందించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత కస్టమర్లు.. తాము ఉన్న ప్లాన్‌లోనే వి- ఫైబర్ స్పీడ్‌కు అప్‌గ్రేడ్‌కు కావటం ద్వారా ఈ స్పీడ్‌ను అందుకోవచ్చని తెలిపింది. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు విధించబోవటం లేదని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో వినియోగదారులు తాము అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి చెందకపోతే మోడెమ్ చార్జీలను పూర్తిగా చెల్లించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!