పాక్‌కు షాక్.. చైనాతో భారత్ సైనిక విన్యాసాలు
Posted by Kishore on 02:38 with No comments
చైనా అండ చూసుకుని తెగ మిడిసిపడుతున్న పాకిస్థాన్‌కు భారత్ షాకిచ్చింది. ఎవరిని చూసుకోనైతే అమెరికాను సైతం ధిక్కరిస్తోందో.. ఆ దేశమే ఇప్పుడు భారత్‌తో సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధపడుతోంది. రష్యాతో సైనిక విన్యాసాలు నిర్వహించామని ఆ దేశం చంకలు గుద్దుకోగా, చైనాతో ఆ పని చేస్తూ మోదీ సర్కారు పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. వాస్తవానికి చైనాతో భారత్ ఇప్పటి వరకూ ఐదుసార్లు హ్యాండ్ టూ హ్యాండ్ ఎక్సర్‌సైజెస్ నిర్వహించింది. ఈ ఏడాది తొలినాళ్లలోనూ లడఖ్, సిక్కింల వద్ద ఇరు దేశాల సరిహద్దుల వెంబడి సైన్యం ఈ విన్యాసాలు చేపట్టింది. కానీ సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఈసారి ఇరు దేశాల సైన్యం మధ్య ఈ తరహా విన్యాసాలు ఉండబోవని అనుకున్నారంతా. కానీ నవంబర్ 15-27 మధ్య పుణే సమీపంలోని ఔధ్‌లో సంయుక్త విన్యాసాలు నిర్వహించాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇటీవలే చైనా ఆధునీకరించిన టిబెట్ మిలిటరీ కమాండ్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 170 ట్రూప్స్ ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి చైనా సొంతం కాగా, ఈ విషయంలో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. వాస్తవానికి చైనాకు కూడా ఉగ్రవాద సమస్య మొదలైంది. షిన్జింగ్ రాష్ట్రంలో ఇస్లామిక్ టెర్రిరిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. పాకిస్థాన్ ప్రోద్బలంతో భారత్‌లోనే కాకుండా ఈ చైనా రాష్ట్రంలోనూ ఉగ్రవాదులు చెలరేగుతున్నారు. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు చైనా మనతో ముందుకు సాగాలని భావిస్తోంది. పాక్ ఎంత మిత్ర దేశమైనా ఉగ్రవాదం విషయంలో అదెంత ప్రమాదకారో చైనాకు తెలుసు. అందుకే ఈ సైనిక విన్యాసాలు.
అరుణాచల్ ప్రదేశ్, టిబెట్‌లో బ్రహ్మపుత్రపై భారీ ప్రాజెక్టులు, మసూద్ అజహర్, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్‌లో భారత్ చేరికకు మోకాలు అడ్డటం తదితర వివాదాలున్నా.. వాటిని పక్కనబెట్టి, పరస్పరం విశ్వాసాన్ని ప్రోది చేసుకునే చర్యలను కొనసాగించాలని చైనా, ఇండియా నిర్ణయించాయి. ఇది పాకిస్థాన్‌కు పెద్ద షాకే. పాపం పాక్ చైనా గురించి పూర్తిగా తెలుసుకోలేదు. చైనా ఇన్ని సమస్యలను సృష్టిస్తుండటంతో భారత్ కూడా అందుకు తగిన రీతిలోనే బదులిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు స్నేహ హస్తం అందివ్వడంతో చైనా ఉలిక్కిపడింది.
ఇక దక్షిణ చైనా సముద్ర వివాదం మనకు బాగా కలిసి వచ్చింది. ఈ విషయంలో సహకరించడంటూ చైనా భారత్‌ను కోరుతోంది. అందుకే ఓవైపు వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులను అమ్ముతూనే.. ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అతిపెద్ద మార్కెట్ అవకాశాలను చూపి చైనాను కంట్రోల్ చేస్తోంది. మనల్ని ఎదగనీయకుండా చేస్తున్న చైనా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూనే.. బ్రిక్స్ దేశాల కూటమి రూపంలో పొరుగు దేశానికి స్నేహ హస్తం చాస్తూనే ఉంది.

0 comments:
Post a Comment
Thank you for Contacting us.
We reply you shortly...!