సాధారణ ప్రయాణికుడిలా మాజీ సీఎం

Posted by Kishore on 02:36 with No comments

నిరాడంబరంగా తెల్లటి పంచె, చొక్కా ధరించిన ఓ పెద్దాయన స్లీపర్‌ క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో సాధారణా ప్రయాణికుడిలా ఓ వైపు తిరిగి పడుకున్నాడు..తొలుత ప్రయాణికులు ఆయన్ను గుర్తించలేదు.. కాసేపటి తర్వాత అర్థమైంది వారికి అయన ఎవరోకాదు.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ ఛాందీ అని. సోమవారం ఆయన రైల్లో స్లీపర్‌ క్లాస్‌లో దాదాపు 160 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు ఆయన వ్యహారశైలిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆడంబరాలకు దూరంగా ఉమెన్‌ చాందీ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తన ప్రయాణంపై ఆయన మాట్లాడుతూ ‘నాకు స్లీపర్‌ క్లాస్‌లో వెళ్లటమంటే చాలా ఇష్టం. పెద్దగా రద్దీ ఉండదు. దూరప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. నాకు ప్రజలతో కలిసి వెళ్లటమంటే చాలా ఇష్టం. లేకపోతే నేను చాలా ఒంటరిగా ఫీలవుతాను. నాకు వీఐపీ ట్రీట్‌మెంట్‌పై నమ్మకంలేదు’ అని పేర్కొన్నారు.
చాందీ ఈ విధంగా ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. మేలో ఆయన ప్రభుత్వం అధికారం కోల్పోయిన వారం తర్వాత కొల్లాం నుంచి తిరువనంతపురానికి బస్సులో ప్రయాణించారు. అప్పట్లో ఓ రాజకీయ సమావేశానికి వెళ్లేందుకు రైలు టిక్కెట్టు దొరక్క పోవటంతో బస్సులో ప్రయాణించారు.
గత వారమే కొందరు పార్లమెంటేరియన్లు తమకు విమాన ప్రయాణాల్లో ప్రత్యేక వసతులు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో చాందీ ప్రయాణం మరింత పాపులారిటీని సాధించింది.