Computers and Technology is the most important and the needful thing in our common life. This blog Computer and Technology titled has created for those who are curious to learn about new things about latest technology and latest computers, its technology, phones, future innovations etc. So we can understand Technology properly to implement those thing on our finger tips to make technology come true in our practical life.

Saturday, 15 October 2016

చిరంజీవి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి పారితోషికం విషయంలోనూ టాపే. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం, మళ్లీ సినిమా పరిశ్రమ తలుపు తట్టడం జరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన తన 150వ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు నాగార్జున నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించనున్నారు.   ఈ ప్రోగ్రామ్‌ కోసం చిరంజీవికి భారీగా రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేశారట నిర్వాహకులు. ఒక్కో ఎపిసోడ్‌కు పదిలక్షల రూపాయలు చిరంజీవి తీసుకోనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అలా ఎన్ని ఎపిసోడ్‌లు ప్రసారమైతే అన్ని...

మరో సంచలనానికి సిద్దమైన గూగుల్, ఫేస్‌బుక్

యావత్ ప్రపంచాన్ని ఇంటర్నెట్టుతో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు మరో బృహత్తరకార్యానికి సన్నాహాలు చేస్తున్నాయి. సెకనుకు 15వేల జీబీల సమాచారాన్ని బదిలీ చేయగల అత్యంత శక్తిమంతమైన కేబుల్ తో ఆసియాను, అమెరికాలను సముద్ర అంతర్భాగం ద్వారా అనుసంధానించనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిలస్ నగరం నుండి ప్రారంభమయ్యే ఈ కేబుల్ హాంకాంగ్ ను అనుసంధానిస్తుంది. సాంకేతిక భాషలో చెప్పాలంటే 120 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఈ కేబుల్ డేటాను బదిలీ చేస్తుంది. రెండు ఖండాలకు అటో దిక్కున ఇటో దిక్కున గల హాంకాంగుకు, లాస్ ఏంజిలస్ నగరాలకు మధ్య...

సొంత రాష్ట్రాన్ని కించపరుస్తావా!

తనకు బహుమతిగా దక్కిన బీఎండబ్ల్యూ కారును.. జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ వెనక్కి ఇచ్చేస్తానని చేసిన ప్రకటనపై త్రిపుర ప్రభుత్వం గుర్రుగా ఉంది. త్రిపుర రహదారులు ఈ కారు తిరిగేందుకు అనువుగా లేవని, తగిన సర్వీస్‌ సెంటర్లు కూడా లేనందున.. బీఎండబ్ల్యూను వెనక్కి తీసుకొని.. దానికి తగిన నగదు కోరడాన్ని తప్పుబట్టింది. త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని సహా విదేశీ ప్రముఖుల కార్లు ఎటువంటి ఇబ్బంది లేకుండానే తిరిగాయని ప్రజా పనుల శాఖ మంత్రి బాదల్‌ పేర్కొన్నారు. స్వరాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడిన దీపకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రవాణా మంత్రి మాణిక్‌దేవ్‌ అన్నార...

మాటలు చెప్పదు.. చేతలే! - భారత సైన్యానికి మోదీ ప్రశంస

సర్జికల్‌ దాడులకు ఆధారాలు చూపాలన్న ప్రతిపక్ష నేతలపై ప్రధాని మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. భారత సైన్యం వాక్‌శూరత్వం చూపదని, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తుందని స్పష్టంచేశారు. శుక్రవారం భోపాల్లో ‘శౌర్య స్మారక్‌’ను ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాజీ సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దులు, దేశాలకు అతీతంగా మానవ జాతిని భారత సైన్యం రక్షిస్తోందని కితాబిచ్చారు. ‘మన జవాన్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వారి యూనిఫారం, వారి ధైర్యసాహసాల గురించే ప్రస్తావిస్తుంటాం. కానీ అంతకుమించిన మూర్తీభవించిన మానవత్వం వారిలో ఉంది. వారు మాటలు చెప్పరు.. వీరత్వాన్ని...

ఎయిర్ సెల్ : రూ.24లకే 1జీబీ 3జీ డేటా

వినియోగదారులకు కొత్త ఆఫర్ ఇచ్చింది ఎయిర్ సెల్. రూ.24 లకే 1 జీబీ 3జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. 28 రోజుల పాటు దీని వ్యాలిడిటీ ఉంటుంది. అయితే దీనకంటే ముందు  రూ. 329లకు 2జీబీ 3జీ డేటాను రీచార్జ్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ రీ చార్జ్ చేసుకుంటే.. ఆ తర్వాత చేసుకునే ప్రతి రూ. 24 ల రీ చార్జ్ కు 1జీబీ 3జీ డేటా లభిస్తుంది.  ఈ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటక, అసోం, ఒడిషా, బీహార్, జార్ఖండ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ లలో ఉంటుంద...

చెలరేగిపోతున్న చైనా గూడ్స్‌

ఎన్‌ఎ్‌సజిలో భారత సభ్యత్వానికి మో కాలడ్డడం, తీవ్రవాది మసూద్‌ అజార్‌పై ఐరాస విధించదలచిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నందున దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు ఒకపక్క వెల్లువెత్తుతున్నా.. మరోవైపు భారతలో చైనా వస్తువుల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయని చైనా మీడియా కోడై కూస్తోంది. భారతలో అతిపెద్ద పండుగ సీజన్‌ అయిన దివాళీ సీజన్‌లో షాపింగ్‌ జోరుగా సాగుతుందని, ఈ సీజన్‌లో చైనా గూడ్స్‌ను బహిష్కరించాలని సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోందని చైనాకు చెందిన అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. కొందరు భారత రాజకీయ నాయకులు కూడా ఇందుకు...

కొత్త జిల్లాలతో రెవెన్యూ ఖజానా కళకళ

రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరుగుతోంది. కొత్త జిల్లాల ఆలోచన కూడా  రెవెన్యూ ఖజానాకు కళ తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా… జిల్లాల్లో … రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడమే గాకుండా రికార్డు స్థాయిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. గత ఆరునెలల కాలంలోరాష్ట్రంలో భూములు, భవనాల అమ్మకాల్లో 31.21 శాతం పెరుగుదల కనిపించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య  ఆరు నెలల కాలంలో… 19వందల35 కోట్లు ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఖజానాకు చేరాయి. గత ఏడాది.. ఇదే కాలంలో.. సర్కారుకు స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ ద్వారా 14వందల75 కోట్లు...

రూ.35,000 కోట్లు ముంచిన నోట్‌7

గెలాక్సీ నోట్‌ 7 స్మార్ట్‌ఫోన్లను వెనక్కి రప్పించడం, విక్రయాల నిలిపివేత వల్ల శామ్‌సంగ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికంలో మొబైల్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభమంతా కోల్పోయే అవకాశం ఉంది. నోట్‌ 7 విక్రయాల నిలిపివేత ప్రభావంతో ప్రస్తుత, రాబోయే త్రైమాసికాల్లో 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.20000 కోట్లు) భారం పడనుందని శామ్‌సంగ్‌ వెల్లడించింది. దీంతో ఈ ఫోన్లను వెనక్కి రప్పించడం వల్ల మొత్తంగా పడే భారం 530 కోట్ల డాలర్లని (రూ.35000 కోట్లు) తెలిపింది. బ్యాటరీ వేడెక్కడం, పేలిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో గెలాక్సీ నోట్‌ 7 విక్రయాలను శామ్‌సంగ్‌...

కశ్మీర్‌లో చైనా జెండాల ప్రదర్శన !

కశ్మీర్ లో వేర్పాటు వాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇప్పటి వరకు పాక్ జెండాలు మాత్రమే ఎగురవేసిన అల్లరిమూకలు తొలిసారిగా పాక్ జెండాలతో పాటు చైనా జెండాలు ప్రదర్శించారు. బారాముల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా తమ పోరాటంలో చైనా సాయం కావాలంటూ పిచ్చిరాతలు రాశారు. ర్యాలీ సందర్భంగా జెండాలు పట్టుకున్న వారు తమ ముఖాలు కనిపించకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసులపై కూడా ఈ అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. పరిస్థితిని అదపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గోవాలో బ్రిక్స్...

పాక్‌ మరింత ఏకాకి!

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా మరింత ఏకాకిని చేసే దిశగా భారత తన దౌత్యపోరును మరింత తీవ్రతరం చేసింది. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి సమావేశాలు శనివారం నుంచి గోవాలో జరుగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పెంగ్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా ప్రభుత్వాధినేతలు తరలివస్తున్నారు. బ్రిక్స్‌ భేటీకి ముందు పుతిన్‌, జిన్‌పెంగ్‌లతో ప్రధాని మోదీ విడివిడిగా ముఖాముఖి ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై...

ఆ రెండు విషయాల్లో భారత్‌ను అడ్డుకుంటాం

జైషే మహ్మాద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించేందుకు సహకరించాలని కోరుతున్న భారత్ విజ్ఞప్తిని చైనా మరోసారి తోసిపుచ్చింది. అణ్వాయుధాల సరఫరాల గ్రూపులో భారత్ చేరడంపై తమ వైఖరి మారబోదని పునరుద్ఘాటించింది.రేపటి నుంచి రెండు రోజులపాటు గోవాలో బ్రిక్స్ సదస్సు జరుగనున్న నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి జెంగ్ శువాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ప్రకారమే భారత్ అణ్వాయుధాల సరఫరాల గ్రూప్‌లో చేర్చుకోవాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. మరోవైపు...

రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రోదేవతాఅనుష్టుప్ ఛందఃసీతా శక్తిఃశ్రీమాన్ హనుమాన్ కీలకంశ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ధ్యానమ్ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థంపీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభంనానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ స్తోత్రమ్చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం...

Friday, 14 October 2016

హిందువులపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రవాస భారతీయులతో భేటీ కాబోతున్నారు. రిపబ్లికన్ హిందూ కొయలిషన్ (ఆర్‌హెచ్‌సీ) న్యూజెర్సీలో ఆదివారం నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఉగ్రవాదం వల్ల బాధితులైన హిందువులనుద్దేశించి ఆయన మాట్లాడతారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల కార్యక్రమానికి అధ్యక్ష అభ్యర్థి హాజరవడం ఇదే మొదటిసారని ఆర్‌హెచ్‌సీ వ్యవస్థాపక చైర్మన్ శలభ్ ‘షల్లి’ కుమార్ చెప్పారు. ఈ సమావేశం వల్ల కశ్మీరీ, హిందూ శరణార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హిందువులు, భారతీయులతో స్నేహం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.   గత...

విజయవాడకు హైస్పీడ్‌ రైలు!

మైసూరు నుంచి బెంగుళూరు, చెన్నై మీదుగా విజయవాడకు త్వరలో హై స్పీడ్‌ రైలు రానుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి జర్మనీ ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నిధులను జర్మనీ ప్రభుత్వం సమకూర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింద...

నిజమో కాదో గూగుల్‌ చెప్పేస్తుంది

ఏదైనా వార్త తెలి స్తే అది నిజమా కాదా అనే సందేహంలో కొంత మంది టెక్‌ ప్రియులు వెంటనే దాన్ని గూగుల్‌ చేసి సమాచారం తెలు సుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ అది నిజమా కాదా అని ఎవరు నిర్ధారిస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. దీంతో ఎక్కడాలేని కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. దీనికి చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ ఒక అడుగు ముందుకేసింది. సెర్చ్‌ కంటెంట్‌లో ఫ్యాక్ట్‌ చెక్‌ అనే ఫీచర్‌ని పరిచయం చేస్తుంది. ప్రతీ అంశం పక్కన ఫ్యాక్ట్‌చెక్‌ అని చూపుతుంది. ప్రస్తుతం గూగుల్‌ న్యూస్‌ అండ్‌ వెదర్‌ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ లో ఫ్యాక్ట్‌చెక్‌ ట్యాగ్‌తో అమెరికా, యూకేలలో యూజర్లకు...

అలా చేస్తే సంబంధాలు దెబ్బతింటాయి... చైనా హెచ్చరిక

భారతీయులు తల్చుకుంటే వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయం చైనాకు కూడా ఉందని స్పష్టమవుతోంది. నేరుగా చెప్పకుండా పరోక్షంగా హెచ్చరికలు, సలహాలు ఇస్తోంది. రాజకీయ సమస్యలను బాహాటంగా చాటిచెప్పడం కోసం చైనా వస్తువులను బహిష్కరించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆ దేశంలోని ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక శుక్రవారం ప్రచురించిన ఓ వ్యాసంలో పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయంటోంది. అందుకు బదులుగా ఇండియాలో ఇండస్ట్రియల్ స్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సలహా ఇచ్చింది. వాణిజ్య లోటును భర్తీ చేయడానికి ఇదే సరైన మార్గమని పేర్కొంది. చైనా వస్తువులకు...

Thursday, 13 October 2016

అధ్యక్ష పీఠం ఎవరెక్కినా.. భారత్‌తో సంబంధాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పాలి

భారత్‌తో సంబంధాలకు పెద్దపీట వేయాల్సిందిగా అమెరికాకు ఆ దేశ అత్యున్నత మేధావి వర్గం సిఫార్సు చేసింది. రానున్న ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా సరే తమ పదవీకాలంలోని తొలి వంద రోజుల్లోపే భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవ్వాలని సూచించింది. తద్వారా ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చాటిచెప్పినట్లవుతుందని పేర్కొంది. భారత్‌-అమెరికా భద్రత సహకారంపై అమెరికాకు చెందిన ‘వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయనాల కేంద్రం(సీఎస్‌ఐఎస్‌)’ తాజాగా కీలక నివేదిక సమర్పించింది. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతమవ్వాలంటే.. వ్యవస్థాపక ఒప్పందాలపై...

ప్రధాని పిలుపుతో మార్పు...చైనా వస్తువులపై వ్యతిరేకత

ఒకప్పుడు చైనా వస్తువులకు ఆ బజార్ అడ్డా. దేశ రాజధానిలో ఉన్నా ఎక్కువగా చైనా ప్రాడెక్టులే లభించేవి. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క చైనా వస్తువు కూడా కనిపించదు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ చైనా వస్తువులను స్వచంధంగా నిషేధించారు.   ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆట వస్తువుల వరకు, పూలు ప్రమిదల నుంచి అలంకరణ సామాగ్రి వరకు, ఆభరణాలు మొదలు టపాసుల వరకు ఏదీ కావాలన్నా కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ సదర్ బజార్. ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ లేదు. మన దేశంలో తయారయ్యే వస్తువులతో పాటు విదేశీ వస్తువులు కూడా ఇక్కడ విక్రయిస్తారు. అది కూడా తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు...

దీపావళి నుంచి వజ్ర మినీ ఏసీ బస్సులు

ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు  కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది  రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ప్రయాణికుల దగ్గరకే బస్ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని సర్వేలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వజ్ర పేరుతో  దీపావళి నుంచి మిని ఏసీ బస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆర్టీసీ. మొదట విడతగా హైదరాబాద్ టూ వరంగల్, హైదరాబాద్ టూ నిజామాబాద్ రూట్లలో నిడిచేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.  హైదరాబాద్ టూ వరంగల్ కు 300 రూపాయలు, హైదరాబాద్ టూ నిజామాబాద్ కు 350 రూపాయలు రేటు...

భూగర్భ జలాలు పెరిగాయి

రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. రెండేళ్లుగా ప్రతీ నెలా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురవగా… ఈ  సెప్టెంబర్ లో మాత్రం అనూహ్యంగా అదనపు వర్షపాతం కురిసింది. సెప్టెంబర్ లో సాధారణ వర్షపాతం 715 మిల్లీమీటర్లు కాగా..ప్రస్తుతం ఏకంగా 943 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక అధిక వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జల విభాగం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అధికంగా హైదరాబాద్ లో 60 శాతం, రంగారెడ్డిలో 48, మెదక్ 43, నిజామాబాద్ లో 42, నల్లగొండలో 37, వరంగల్  లో 33, మహబూబ్...

సెకనుకు 100 ఎంబిపిఎస్‌ స్పీడ్‌

టెలికాం రంగంలో పట్టును నిలుపుకునేందుకు గాను భారతి ఎయిర్‌టెల్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వినియోగదారుల కోసం ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్‌ తాజాగా వి-ఫైబర్‌ టెక్నాలజీతో సెకనుకు 100 మెగాబిట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు ఈ సేవలను అందించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత కస్టమర్లు.. తాము ఉన్న ప్లాన్‌లోనే వి- ఫైబర్‌ స్పీడ్‌కు అప్‌గ్రేడ్‌కు కావటం ద్వారా ఈ స్పీడ్‌ను అందుకోవచ్చని తెలిపింది. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు విధించబోవటం లేదని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో వినియోగదారులు...

అవుతారా.. మీరూ అంబానీ!

అనంత్‌ అంబానీ... 18 నెలల్లో 108 కిలోలు తగ్గిన కుర్రాడు. యువతకు తాజా రోల్‌మోడల్‌. అంతులేని సంపద... అందుబాటులో అన్ని సౌకర్యాలు... ఇవేవీ అతడ్ని నాజూగ్గా తయారు చేయలేకపోయాయి. కేవలం కఠోరమైన శ్రమే లక్ష్యాన్ని చేర్చింది. అతగాడి అనుభవం నుంచి పాఠాలు నేర్చితే మనమూ ఏదైనా సాధించొచ్చు. ప్రయోజనం ప్రతి పనికీ ఒక పర్పస్‌ ఉంటుంది బాస్‌. బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉండొద్దా? నాకూ ఒక లవర్‌ ఉండాలి... వచ్చే పుట్టినరోజుకల్లా స్లిమ్‌గా తయారవ్వాలి... ఇలా ఏదో ఒక లక్ష్యం...

పగిలిన మనసుల మ్యూజియం

పురాతన వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు భద్రపరచేది మ్యూజియం అని అందరికీ తెలుసు. క్రొయేషియాలోని జగ్రెబ్‌లోనూ ఓ మ్యూజియం ఉంది. దీని కథే వేరు. ఇందులో ఉండే వస్తువులన్నీ ప్రేమికుల ప్రేమకు గుర్తుగా ఇచ్చిపుచ్చుకున్న నజరానాలు. కాకపోతే వారి బంధం బెడిసికొట్టాకే ఇక్కడకు చేరతాయి. సూటిగా విషయానికొస్తే.. ఒలింకా విస్టికా, డ్రేజెన్‌ గ్రుబ్సిక్‌ ప్రేమికులు. నాలుగేళ్లు గాఢంగా ప్రేమించుకున్నాక ఏవో తేడాలొచ్చి విడిపోయారు. మరి ఇన్నాళ్లుగా ఇచ్చిపుచ్చుకున్న బహుమతుల సంగతేంటి...

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు

‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం. తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా...

ఆ సినిమా ‘బాహుబలి 2’కి పోటీ కాదు

‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’ చిత్రం ‘బాహుబలి 2’కి పోటీకాదని బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌ అన్నారు. ‘శివాయ్‌’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సన్స్‌ ఆఫ్‌ సర్దార్‌’. సరగర్హి యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ తరహాలో ఇండియాలోనే పెద్ద యుద్ధ చిత్రంగా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు అజయ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటి వరకు దేశం నుంచి ‘బాహుబలి’ చిత్రం మాత్రమే యుద్ధ నేపథ్యంలో భారీగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మన్ననలు...

శ్రీ రాఘవేంద్రస్వామి

భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు. క్షేత్రచరిత్ర/స్థల పురాణం: మంత్రాలయం ఒకప్పుడు మారుమూల ప్రాంతం. మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో...